ప్రకాశం: అద్దంకి పురపాలక సంఘంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను కమిషనర్ రవీంద్ర ప్రకటించారు. మొత్తం 32 వార్డులకు సంబంధించి సామాజిక వర్గాల వారీగా ఓటర్లను గుర్తించి జాబితాను సిద్ధం చేశారు. అనంతరం ఈ జాబితాను ప్రజల పరిశీలన కోసం పురపాలక సంఘం నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఓటర్ల వివరాలను పారదర్శకంగా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా ఓటర్ల జాబితా విడుదల


