NLR: కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలోని జమ్మిపాళెం రోడ్డులో పాత ప్లాస్టిక్ స్క్రాప్ అంగడిలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, లేక ఎవరైనా నిప్పంటించారా అన్నది తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పడుగుపాడులో అగ్నిప్రమాదం


