SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ఇవాళ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చనలు జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి కృపతో సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు


