హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో వర్షపు నీటి కష్టాలు

NTR: నందిగామ పట్టణంలోని రైతుపేట 11వ వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా సీసీ రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. డ్రైనేజీల్లో చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడంతో దోమలు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.