హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముద్దనూరులో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

KDP: ముద్దనూరు మండలంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సీఐ నగేష్‌బాబు సిబ్బందితో కలిసి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.