KKD: కోటనందూరు మండలం పాతకొట్టాం గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వెండి కిరీటం, శంఖు చక్రాలు, వెండి హస్తాలు, పంచపాత్రలు సహా సుమారు 3 కిలోల వెండి, రూ. 90 వేల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు, వేలిముద్రలు సేకరిస్తోందని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో చోరీ... వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం


