హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గన్నవరంలో భారీగా గంజాయి స్వాధీనం

కృష్ణా: గన్నవరం పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన గస్తీలో పల్నాడు జిల్లాకు చెందిన కుంచపు సురేష్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 1.50 లక్షల విలువైన 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు DSP ధర్మేంద్ర తెలిపారు. సబ్ డివిజన్‌లో ఇప్పటివరకు 622 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 35 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.