హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఐటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సాయి

కోనసీమ: నందంపూడి గ్రామానికి చెందిన దేవరపల్లి సాయి రవీంద్రను వైసీపీ ఐటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీనికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని సాయి రవీంద్ర తెలిపారు.