హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షం వస్తే రహదారులన్నీ జలమయం

కృష్ణా: గుడ్లవల్లెరు మండలం గాదేపూడిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం పడిన ప్రతిసారీ రహదారులపై నీరు నిలిచిపోతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చూపాలని కోరుతున్నారు.