హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డు స్థాయిలో 15వ సారి స్వామివారికి పట్టువస్త్రాలు

TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సీఎం చంద్రబాబు రేపు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి సేవలో రికార్డు స్థాయిలో 15వ సారి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎంగా ఆయన నిలవనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని తిరుమలలో జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.