హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్‌ల వద్ద డీఎస్పీ అలర్ట్.. భారీ బందోబస్తు

ప్రకాశం: గణేష్ విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో ఒంగోలు డీఎస్పీ కొత్తపట్నం, ఈతముక్కల, మాడనూరు బీచ్‌లను నేరుగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మండపాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు.