హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణనాథుడి సేవలో జిల్లా ఎస్పీ దంపతులు

NLR: వినాయక చవితి పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల దంపతులు వేదమంత్రోచ్ఛారణల మధ్య గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.