హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతియుతంగా చవితి వేడుకలు జరపాలి'

అన్నమయ్య: మదనపల్లెలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. ఎస్పీ సూచనల మేరకు సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసు అధికారులు గణేష్ మండపాలను నేరుగా సందర్శించి భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ఉత్సవ నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ.. పోలీసు శాఖకు సహకరించి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.