హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కళ్లను ఇలా కాపాడుకోండి..!

మొబైల్, ల్యాప్‌టాప్‌లను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లలో అలసట, పొడిబారడం, మంట వంటి సమస్యలు రావచ్చు. కళ్ల ఆరోగ్యానికి క్యారెట్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు వంటి పోషకాహారం తీసుకోవాలి. స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20నిమిషాలకు, 20 అడుగుల దూరంలోని వస్తువును 20సెకన్లపాటు చూడాలి. తగినంత నిద్ర, తరచూ కనురెప్పలు వాల్చడం కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.