హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బిళ్ల గన్నేరుతో ప్రయోజనాలు ఇవే?

సదాబహార్‌ (బిళ్ల గన్నేరు) మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యం ఉంది. మధుమేహం, రక్తపోటు నియంత్రణలో సహాయపడే గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అధికంగా తీసుకుంటే వాంతులు, మైకం, కడుపు అసౌకర్యం కలగొచ్చు. షుగర్‌ మందులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణులు, బాలింతలు దూరంగా ఉండాలి. ఔషధంగా ఉపయోగించే ముందు వైద్యుల సలహా తప్పనిసరి.