హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదరణ లేక అనాథగా మారిన గణపతి

MHBD: తొర్రూరు మండలం మాటేడులో ఆదరణ లేక అరుదైన విఘ్నేశ్వరుని విగ్రహం చెట్ల పొదల మధ్య అనాథగా మారింది. వేల ఏళ్ల చరిత్ర, అద్భుత శిల్పకళ కలిగిన ఈ విగ్రహానికి ఆలయం కట్టిస్తామన్న పాలకుల హామీలు నేటికీ నెరవేరలేదు. దేశమంతా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఇప్పటికైనా ఇక్కడ ఆలయం నిర్మించి, చారిత్రక సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.