హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్ల గింజలతో వినాయక విగ్రహం

కడప: వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరగాయల వీధిలో వడ్ల గింజలతో రూపొందించిన వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. వంకదార రాము ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా నీటిలో సులభంగా కరిగిపోయేలా దీనిని రూపొందించారు. వర్షాలు కురిసి రైతులకు పంటలు చేతికందాలని ఆకాంక్షిస్తూ గణనాథుడిని ప్రత్యేకంగా ప్రార్థించారు.