హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

CTR: కాణిపాకంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం ఎస్పీ తుషార్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయాన్ని సందర్శించిన ఆయన భక్తుల రద్దీ, క్యూ లైన్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.