హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆవంచ గుండు గణపతికి ఆలయం కరువు

NGKL: తిమ్మాజీపేట మండలం ఆవంచలోని చారిత్రక గుండు గణపతి ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. 12వ శతాబ్దంలో రాజు తైలపుడు చెక్కించిన 30 అడుగుల ఏకశిలా విగ్రహానికి నేటికీ పూర్తిస్థాయి గుడి లేకుండా రేకుల షెడ్డులోనే పూజలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన ఈ చారిత్రక విగ్రహానికి తక్షణమే శాశ్వత ఆలయం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.