హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలదిగ్బంధ ప్రాంతాల్లో ప్రయాణాలు వద్దు: ఏసీపీ

SDPT: వర్షాల ఉధృతితో వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా పోలీసులు చర్యలు చేపట్టినట్లు సిద్దిపేట ఏసీపీ సదానందం తెలిపారు. ప్రవాహాలు ఎక్కువగా ఉన్న చోట ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించారు. ప్రమాదకర ప్రాంతాల్లో సిబ్బందిని కాపలా ఉంచామని, ఏ క్షణమైనా ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. నిబంధనలు దాటి నీటిలోకి వెళ్లవద్దని కోరారు.