హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ ఫ్యాకల్టీ నియామకంపై వివాదం

WGL: రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ గెస్ట్ లెక్చరర్ నియామకంపై వివాదం నెలకొంది. నిబంధనల ప్రకారం స్థానిక అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, జనగామ జిల్లాకు చెందిన వ్యక్తితో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అర్హుడైనప్పటికీ తనకు అవకాశం దక్కలేదని అభ్యర్థి దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించి నిరుద్యోగికి న్యాయం చేయాలని కోరుతున్నాడు.