హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా వినాయక చవితి వేడుకలు

NTR: విజయవాడలోని ఇంద్రకీలాడ్రిపై వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలను కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో మహా గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. సీనా నాయక్ పాల్గొన్నారు.