హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వ్యవసాయ మార్కెట్ ప్రారంభం..!

MHBD: నాలుగు రోజుల విరామం అనంతరం మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ మంగళవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య, శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం వినాయక చవితి కావడంతో మార్కెట్ బంద్ ఉంది. కాగా రేపు ఉదయం 6 గంటల నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలన్నారు.