NRPT: మరికల్ మండలం ఎక్లాస్‌పూర్‌కి చెందిన రైతు చాంద్ పాషా (48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో వరి పంటకు యూరియాతో కూడిన గుళికలు చల్లేందుకు వెళ్లిన ఆయన అక్కడే మృతి చెందినట్లు SI ఏ.రామ్‌లాల్ నాయక్ తెలిపారు. మృతికి కరెంట్ షాక్ కారణమా, క్రిమిసంహారక మందుల ప్రభావమా అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.
తెలంగాణ
వరి పొలంలో అనుమానాస్పద మృతి


