GNTR: టంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు 50 ఏళ్లు ఉంటుందని ఒంగోలు రైల్వే పోలీసులు తెలిపారు. నీలం రంగు షర్ట్, జీన్స్ ధరించి ఉన్నాడు. కుడి మణికట్టుపై అమ్మా నాన్న, చేతిపై ‘OG’ పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడి వద్ద చెన్నై–తెనాలి రైలు టికెట్ లభించింది. తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం..!


