హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏల్చూరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలోని లైబ్రరీ సెంటర్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో గ్రామస్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినాయకుడి నామస్మరణతో లైబ్రరీ సెంటర్ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.