హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలి: MLA

HNK: హనుమకొండ కనకదుర్గ కాలనీ, అంబేద్కర్ సర్కిల్లో వినాయక చవితి వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.