హైదరాబాద్: 28°C
తెలంగాణ

24 గంటల త్రీఫేస్‌ కరెంట్ ఇవ్వాలి: CPI (ML)

KMM: రైతులకు కోతలు లేని త్రీఫేస్‌ కరెంట్‌ను 24 గంటలు అందించాలని సీపీఐ (ఎంఎల్‌) పాలేరు డివిజన్‌ కార్యదర్శి బందెల వెంకయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం సబ్‌స్టేషన్‌ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్‌ కోతలు మరింత సమస్యగా మారాయని ఆయన ఆరోపించారు.