హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉప్పొంగిన ఆకేరు..!

WGL: వర్ధన్నపేట మండల పరిధిలో ప్రవహించే ఆకేరు వాగు జలకళను సంతరించుకుంటోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమవారం వాగులోకి భారీగా వరద నీరు చేరుతోంది. కోనాయిచలం మీదుగా వస్తున్న నీరు వర్ధన్నపేట పట్టణం వాగులోకి చేరుకుంటుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో ఆకేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.