హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిట్ టీవీ వార్తకు స్పందన

MDK: సూరారం పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై గుంతలతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిపై హిట్ టీవీలో ఆదివారం కథనం ప్రచురితమైంది. దీనిపై ఇవాళ స్పందించిన సర్పంచ్ చిలుక నాగరాజు వెంటనే నల్లమట్టితో గుంతలను పూడ్చి రాకపోకలను సులభతరం చేశారు. సమయానికి స్పందించి ప్రమాదాలు నివారించినందుకు హిట్ టీవీకి, సర్పంచ్‌కు స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.