సత్యసాయి: మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గౌస్ మొహద్దీన్ తల్లి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గౌస్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పల్లె రఘునాథరెడ్డి వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శ


