హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేయిస్తంభాల ఆలయంలో ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ మహా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కుటుంబ సమేతంగా అధికారికంగా ప్రారంభించారు. సోమవారం ఉదయం MLA తన సతీమణి నీలిమతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మహాగణపతిని MLA దంపతులు దర్శించుకుని, ఉత్సవాలు ప్రారంభించారు.