JN: రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గ్రామ పరిధిలోని పలు చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో చెరువులు నిండుకుండలా మారి మత్తడిపోస్తున్నాయి. చెరువుల నుంచి నీరు అలుగులపై నుంచి ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
VIDEO: భారీ వర్షాలతో మత్తడిపోస్తున్న చెరువులు


