SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామానికి చెందిన శంకర్ గౌడ్‌కు రూ.38 వేలు, పిట్ల అనుషవ్వకు రూ.12 వేల సీఎంఆర్‌ఎఫ్ (CMRF) వైద్య ఖర్చుల చెక్కులను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోమవారం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత


