హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారం ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం

KMR: పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. సోమవారం మధ్యాహ్నం 12గంటల సగటు వివరాల ప్రకారం ప్రాజెక్టు నీటిమట్టం 1462.60 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం (FRL) 1464 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1.40 అడుగులు తక్కువగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి సామర్థ్యం 1.591 టీఎంసీలుగా ఉంది.