హైదరాబాద్: 28°C
తెలంగాణ

నరకాన్ని తలపిస్తున్న రోడ్లు

NLG: కొండమల్లేపల్లి నుంచి నల్లగొండ వెళ్లే ప్రధాన రహదారి గుంతలుగా మారడంతో ప్రయాణం నరకంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మల్లేపల్లి నుంచి గుమ్మడవెల్లి వరకు పూర్తిగా రోడ్డు పాడైందని తెలిపారు. ఇటీవల రోడ్డు వెడల్పు కోసం కనగల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కనీసం ఏర్పడిన గుంతలకు మరమ్మత్తు పనులైనా చేయాలని కోరుతున్నారు.