హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో వ్యర్థాలను వేసే వారిపై చర్యలు తీసుకోవాలి

NLG: నల్గొండ మండల పరిధిలోని ఖాజీరామారం గ్రామ శివారులోని సీతాఫల చెరువులో రాత్రి వేళల్లో కుళ్లిపోయిన కోళ్ల మృతదేహాలు, ఇతర వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో నీరు దుర్వాసన వెదజల్లుతుండటంతో పశువులు, గొర్రెలు తాగడం లేదని రైతులు వాపోతున్నారు. దీనివల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.