హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా వినాయక చవితి వేడుకలు

SKLM: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. పప్పు ఉండ్రాళ్లు, పుష్పాలు, అష్ట ఫలాలతో వినాయకుడికి నైవేద్యాలు సమర్పించారు. గ్రామస్తులు, యువత కుటుంబ సమేతంగా పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.