ప్రకాశం: ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కురిచేడు నుంచి గొల్లపాలెం, కాటంవారిపాలెం, పేరం బొట్లపాలెం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలో వృక్షం నేలకు ఒరిగింది. దీంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి వృక్షం తొలగించి, రాకపోకలు పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
కురిచేడులో వర్షం.. నేలకొరిగిన వృక్షం


