హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 63 అడుగుల విజయ గణపతి.. ఎక్కడంటే?

కృష్ణా: వినాయక చవితి వేడుకలకు మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం సిద్ధమైంది. 63 అడుగుల భారీ సప్తమృత్తిక విజయ గణపతి విగ్రహం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సముద్ర అలల హోరు, విద్యుత్ కాంతులు, త్రివర్ణ పతాకంతో తీర ప్రాంతం పండగ శోభను సంతరించుకోనుంది. కాగా భక్తుల కోసం నిర్వాహకులు వివిధ రకాల బీచ్ రైడ్లు, స్టాల్స్, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.