హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోలుగుంట మండలంలో ప్రగతి పనులు'

AKP: రోలుగుంట మండలంలోని రెండు పంచాయతీల్లో రూ.8 లక్షల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులు పట్టాలెక్కాయి. కొండపాలెం సమీపంలో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న శ్మశానవాటిక షెడ్డు నిర్మాణాన్ని మాజీ సర్పంచ్ బంటు సూర్యసన్యాసి దేముళ్లు సోమవారం ప్రారంభించారు. మరోవైపు జె.పి.అగ్రహారంలో రూ.3 లక్షలతో సీసీ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని స్థానిక నాయకులు వెల్లడించారు.