హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో 2 వేల మంది పోలీసులు

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తు విధుల్లో ప్రతి పోలీసు సిబ్బంది "భక్తుల భద్రత-శ్రీవారి సేవ" అనే బాధ్యతా భావంతో పనిచేయాలని ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి తిరుమలకు వచ్చిన సుమారు 2,000 మంది పోలీసులకు విధులు కేటాయించిన ప్రాంతాల్లో స్పాట్ బ్రీఫింగ్ నిర్వహించారు. భక్తుల పట్ల సంయమనం,అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలన్నారు.