హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో CM పర్యటన ఇలా!

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఈనెల 15న రాత్రి 7.30 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామివారిని దర్శించుకుని వాహన సేవలో పాల్గొంటారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, ప్రసాద స్వీకరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 16న ఉదయం తిరుమలలో మూడు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.