హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి: బొడ్డు

తూ.గో: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని TDP శ్రేణులకు నియోజకవర్గ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం బూరుగుపూడి గేట్ వద్ద గల TDP కార్యాలయంలో సీతానగరం మండల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.