KRNL: ఆదోని రూరల్ సీఐ నల్లప్ప ఆధ్వర్యంలో ఎస్సై తన సిబ్బందితో కలిసి సుల్తానాపురం కొండల్లో డ్రోన్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. రహస్యంగా నిర్వహిస్తున్న నాటుసారా బట్టీని గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు. 350 లీటర్ల బెల్లం ఊట, 75 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. నిందితుల నుంచి బైకును స్వాధీనం చేసుకుని పరారైన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా నాటు సారా ధ్వంసం


