హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తగరపువలసలో కేదార్ నాథ్ సెట్టింగ్

VSP: తగరపువలస సమీపంలోని సంగివలస గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులను ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని తలపించేలా 3D శైలిలో ఈ సెట్టింగ్‌ను తీర్చిదిద్దారు. రాతి నిర్మాణాన్ని ప్రతిబింబించే డిజైన్ ప్రవేశ ద్వారం చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. ఈ ఏర్పాట్లతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.