హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తౌషిక్ తల్లి కేసుపై SP కీలక వ్యాఖ్యలు

ప్రకాశం: తౌషిక్ తల్లి మౌలాబి ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్దన్ స్పష్టం చేశారు. పూర్తి విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు హైకోర్టు ఆదేశాలతో సెల్‌ఫోన్, CC ఫుటేజీ సహా శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సున్నితమైన ఘటనలపై నిజాలు బయటకు రాకముందే అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని SP హెచ్చరించారు.