హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చవితి శుభాకాంక్షలు తెలిపిన తిరుపతి కలెక్టర్

CTR: వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.