హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండికోట జలాశయానికి కృష్ణా జలాలు

KDP: గండికోట ప్రాజెక్టుకు కృష్ణాజలాలు చేరుతున్నట్లు జలవనరులశాఖ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి 2,200 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. దీంతో గండికోటలో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.9 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ తెలిపారు.