PPM: పాచిపెంట మండలం మాతుమూరు- గోగాడవలస కూడలి నుంచి వేటగానివలస వరకు బీటీ రోడ్డు దెబ్బతింది. సుమారు 5.78 కి.మీ మేర తారు ఊడిపోయి రాళ్లు బయటకు తేలాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డంతా రాళ్లే.. వాహనదారులకు తిప్పలే


